మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నటించిన బ్లాక్‌బస్టర్ చిత్రాల జాబితాలో 'ఇంద్ర' స్థానం ఎప్పటికీ ప్రత్యేకం. 2002లో విడుదలై బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించిన ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అప్పటి తరం ప్రేక్షకులను థియేటర్లలో ఉర్రూతలూగించిన ఈ అద్భుతమైన సినిమాను, ఇప్పటి తరం కూడా అదే స్థాయిలో ఆస్వాదించేలా చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ (Vyjayanthi Movies) ఓ శుభవార్తను ప్రకటించింది.
సరికొత్త హంగులతో 4K వెర్షన్:
మాస్ డైరెక్టర్ బి.గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ ఇప్పుడు సరికొత్త హంగులతో డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పైకి వచ్చింది. ఈ చిత్రాన్ని అత్యుత్తమ క్వాలిటీతో 4కే రీమాస్టర్డ్ వెర్షన్లో (INDRA Full Movie 4K UHD) సిద్ధం చేసినట్లు వైజయంతీ మూవీస్ వెల్లడించింది. ఈరోజు నుంచి యూట్యూబ్‌లో ఈ 4K వెర్షన్ 'ఇంద్ర' సినిమా అందరికీ అందుబాటులో ఉంటుందని తెలిపింది.
ఆ డైలాగ్స్, ఆ వీణ స్టెప్.. ఎప్పటికీ ఎవర్ గ్రీన్!
'ఇంద్ర' సినిమా థియేటర్లలో విడుదలైనప్పుడు ఎక్కడ చూసినా హౌస్‌ఫుల్ బోర్డులతో ఏకంగా పండగ వాతావరణం నెలకొంది. 'ఇంద్ర.. ఇంద్రసేనా రెడ్డి.. ' అంటూ మెగాస్టార్ చెప్పిన పవర్ఫుల్ డైలాగులు, ఆయన వేసిన గ్రేస్‌ఫుల్ డ్యాన్సులు, మరీ ముఖ్యంగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతానికి చిరు వేసిన 'వీణ స్టెప్' ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
అప్పట్లో టాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డులన్నింటినీ తిరగరాస్తూ, మెగాస్టార్ ఇమేజ్ను శిఖరస్థాయికి చేర్చిన ఈ సినిమాను ఇప్పుడు 4K రిజల్యూషన్‌లో చూసి ఎంజాయ్ చేసే అవకాశం రావడం అభిమానులకు పండగే అని చెప్పాలి! ఇంకెందుకు ఆలస్యం, యూట్యూబ్‌లో మెగాస్టార్ మ్యాజిక్‌ను మళ్లీ చూసేయండి!
